Home  »  TV News  »  జయచంద్ర ‌ఆశీర్వాదం తీసుకున్న వసుధార.. ‌మీరిద్దరు ఒక్కటే!

Updated : Apr 4, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -727 లో.. రిషి,‌ వసుధారలు గెస్ట్ గా వచ్చిన జయచంద్రకి గది చూపిస్తారు. ఇంతలో అక్కడ వసుధార చున్నీ పడి ఉండడం గమనించిన వసుధార.. జయచంద్ర దానిని చూడకముందే తీసెయ్యాలని అనుకొని రిషికి సైగ చేస్తూ ఉండగా.. జయచంద్ర ఆ చున్నీని చూస్తాడు. ఇంతకుముందు ఈ గదిలో ఆడవాళ్ళు ఉండేవాళ్ళా అని జయచంద్ర అడుగుతాడు. వసుధార ఆ చున్నీని తీసి చేత్తో పట్టుకుంటుంది. రిషి డైవర్ట్ చేస్తూ.. మీరు మా గెస్ట్ మీకు నచ్చినట్లు ఉండండి సర్ అని అంటాడు. మీకు భోజనం ఇక్కడికి తీసుకురావాలా? అక్కడకు వస్తారా అని రిషి అడిగేసరికి.. మీకు ఏది నచ్చితే  అది చెయ్యండని జయచంద్ర అంటాడు. మీరు మా అందరితో కలిసి భోజనం చేస్తే బాగుంటుందని రిషి అనగానే సరేనంటాడు జయచంద్ర.

ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుండగా వసుధారని రిషి పక్కన కూర్చోమంటాడు జయచంద్ర. వసుధార, రిషిలను అనుమానం వచ్చినట్లు జయచంద్ర చూస్తుంటాడు. అది కవర్ చేయడానికి వసుధార కావాలనే.. సర్ ఇది వేసుకోండి, అది వేసుకోండి అని అంటూ ఉంటుంది. నువ్వు ఏంటమ్మా సర్ అంటున్నావ్ అని జయచంద్ర అడగగా.. నాకు అలా అలవాటయిందని చెప్తుంది వసుధార. మీది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అని జయచంద్ర అడుగుతాడు. వాళ్ళది అసలు మ్యారేజే కాదని దేవాయని చెప్తుండగా.. మన ఫ్యామిలీ విషయాలు ఇప్పుడు డిస్కస్ చెయ్యడం కరెక్ట్ కాదు పెద్దమ్మ అని రిషి అంటాడు. ఆ తర్వాత జయచంద్ర దగ్గరికి వాటర్ తీసుకొని వసుధార వెళ్తుంది. మీకు పెళ్లి అయ్యి ఎన్ని ఏళ్ళు అవుతుంది. మీ ఇద్దరి కళ్ళలో ప్రేమ కనిపిస్తుంది.. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉన్నట్టుగా కనిపిస్తుంది.. నువ్వు ఎంత కష్టమైనా భరిస్తావ్.. మీ కళ్ళలో ప్రేమతో పాటు బాధ కూడా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు విడిగా ఉండకండని జయచంద్ర చెప్తాడు. సరే సర్ అని జయచంద్ర ఆశీర్వాదం తీసుకొని  వెళ్లిపోతుంటే డోర్ దగ్గర రిషి ఉంటాడు. రిషి కళ్ళలోకి చూసి వెళ్ళిపోతుంది వసుధార. ఆ తర్వాత రిషి జయచంద్ర దగ్గరికి వస్తాడు. సీత లాంటి భార్య దొరికింది.. అలా అని ఆమె ప్రేమకు పరీక్షలు పెట్టకు.. మీరు ఇద్దరు వేరు‌వేరు కాదు ఒక్కరే.. సంతోషంగా ఉండండని జయచంద్ర చెప్తాడు. సరే గుడ్ నైట్ సర్ అని రిషి చెప్పేసి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత వసుధార దగ్గరికి రిషి వెళ్తాడు. జయచంద్ర చెప్పిన మాటలన్నీ రిషితో చెప్తుంది వసుధార. సరే గుడ్ నైట్ అని రిషి వెళ్ళిపోతాడు. మేము ఇలా ఇద్దరం వేరు వేరు రూమ్ లలో పడుకుంటే సర్ కి డౌట్ వస్తుందేమోనని రిషి‌ మళ్ళీ వసుధార దగ్గరికి వెళ్తాడు. సర్ మళ్ళీ వచ్చారేంటని వసుధార అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.